*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
భట్రాజు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు ఎర్రమరాజు సాయికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరాజు విష్ణువర్ధన్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్ణచందర్ రాజు లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా భట్రాజు సంఘం బలోపేతం కోసం పలు జిల్లాల్లో సంస్థాగత మార్పులు, నూతన బాధ్యతల కేటాయింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయికృష్ణ మాట్లాడుతూ, 2001లో మెదక్ జిల్లా భట్రాజు సంఘం పునర్నిర్మాణంలో తన తండ్రి దివంగత ఎర్రమరాజు వెంకట నరసింహరాజు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సంఘ సేవలో భాగస్వామిగా కొనసాగుతున్నానని తెలిపారు. సిద్దిపేట జిల్లా భట్రాజు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తాను చేపట్టిన సేవా కార్యక్రమాలను రాష్ట్ర నాయకత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం కార్యదర్శి బాధ్యతలను అప్పగించడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ నియామకం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. భట్రాజు సంఘం అభ్యున్నతికి, కులస్తుల సంక్షేమం, యువత ప్రోత్సాహం మరియు సంఘ ఐక్యత కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని సాయి కృష్ణ స్పష్టం చేశారు. తన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, జిల్లా నాయకులకు, సంఘ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
Telangana
*భట్రాజు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సాయికృష్ణ నియామకం*
Quick Summary:
రాష్ట్ర కార్యదర్శిగా సాయికృష్ణ