నేటి సాక్షి ఆగస్టు 11
పెద్దకడుబూరు ఆపదలో ఉన్న పేద కుటుంబానికి వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్థిక చేయూత అందించారు. పెద్దకడుబూరు ఎస్సీ కాలనీకి చెందిన గింజ చంద్రమ్మ మనవరాలి వివాహానికి ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ప్రదీప్ రెడ్డి తరఫున రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
ఇటీవల బనవాసి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గింజ ప్రభు మృతి చెందడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తండ్రి మరణంతో పెళ్లి బాధ్యతలు భారంగా మారిన కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నాయకులు, ఇచ్చిన మాట ప్రకారం వివాహానికి ఆర్థిక సహాయం అందించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ బాపురం రామ్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు కష్టసమయంలో అండగా నిలవడమే తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ వంతు సహకారం అందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పెద్దకడుబూరు ఎస్సీ నాయకులు జె. ముక్కరన్న, బి. అర్లప్ప, మేకల రాజు, పూజారి రాజు తదితరులు పాల్గొన్నారు.
Andhra
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక అండ పెళ్లి ఖర్చులకు రూ.25 వేల సాయం
Quick Summary:
పెళ్లి ఖర్చులకు రూ.25 వేల సాయం