నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లాలోని చెంగోముల్ పోలీస్ స్టేషన్‌తో పాటు పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా, డీఐజీ గారికి ఘన స్వాగతం పలికారు. తనిఖీల సందర్భంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ శాఖల పనితీరు, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణను కూలంకషంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధి నిర్వహణ, సంక్షేమం, పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెంగోముల్ పోలీస్ స్టేషన్, పరిగి సర్కిల్ కార్యాలయ ఆవరణల్లో మొక్కలు నాటిన డీఐజీ , "వికారాబాద్ రక్షణ నేత్రం" కార్యక్రమంలో భాగంగా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో 110 కెమెరాలు మరియు చెంగో ముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 61 కెమెరాలు మొత్తం 171 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల పనితీరును పరిశీలించి, సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్, మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, ముఖ్యంగా CCTNS 2.0, e-Sakshya, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి అంశాల్లో ప్రతి పోలీస్ అధికారి నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సేవలందించాలని సూచించారు.
ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, రివార్డులు అందుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన డీఐజీ ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.
అనంతరం వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వార్షిక తనిఖీల ముగింపు పరేడ్ (క్లోసింగ్ పరేడ్) లో డీఐజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల క్రమశిక్షణ, సమన్వయం, పరేడ్ నిర్వహణను పరిశీలించిన ఆయన, వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, నాయకత్వంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత క్రమశిక్షణతో, సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు.
పరేడ్‌లో పాల్గొన్న అన్ని ప్లాటూన్లు అత్యుత్తమ టర్న్‌అవుట్, క్రమశిక్షణను ప్రదర్శించాయని, ముఖ్యంగా పరేడ్ కమాండర్ నాగరాజు సమర్థవంతంగా పరేడ్‌ను నిర్వహించారని అభినందించారు. అలాగే అన్ని ప్లాటూన్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని, ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారుల ప్లాటూన్ అత్యంత క్రమశిక్షణతో, అద్భుతంగా పరేడ్ నిర్వహించి ప్రత్యేక ప్రశంసలు అందుకుందని డీఐజీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా, కృతజ్ఞతా ప్రసంగం చేస్తూ, వార్షిక తనిఖీల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖకు విలువైన మార్గదర్శకాలు, సూచనలు అందించిన చార్మినార్ జోన్ గౌరవ డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్, గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డీఐజీ సూచించిన ప్రతి అంశాన్ని జిల్లా పోలీస్ శాఖలో సమర్థవంతంగా అమలు చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలను అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేశ్ మీనా , జిల్లా డిసిఆర్‌బి డిఎస్‌పి జానయ్య, డిటిసి డిఎస్‌పి శ్రీనివాస్, వికారాబాద్ డిఎస్‌పి అంజయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ గారు, DAR డిఎస్‌పి వీరేశ్ అధికారులు ,ఇన్స్పెక్టర్ లు, ఆర్‌ఐ లు, ఎస్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐ లు , సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
Telangana
వార్షిక తనిఖీల్లో భాగంగా చెంగోముల్ పోలీస్ స్టేషన్, పరిగి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన. చార్మినార్ జోన్ గౌరవ డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్, వార్షిక తనిఖీలలో భాగంగా చార్మినార్ జోన్ గౌరవ డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్,
Quick Summary:
పరిగి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన.
