Telangana
ప్రభుత్వం నిర్దేశించిన విత్తనాలను మాత్రమే... విక్రయించాలి -అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు : వ్యవసాయ శాఖ అధికారి రూషేంద్రమణి
Quick Summary:
ప్రభుత్వం నిర్దేశించిన విత్తనాలను మాత్రమే...
మిర్యాలగూడ, నేటిసాక్షి : పట్టణంలోని రైతుమిత్ర దుకాణం, చీదళ్ల అనంతరాములు అండ్ సన్స్ షాపు, యొద సీడ్స్ షాపులో ఉన్న వరి విత్తనాలను శనివారం మండల వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్రమణి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించిన 7 వరి రకాల వరి విత్తనాల శాంపిల్స్ సేకరించి, వాటిని సీడ్స్ టెస్టింగ్ లేబరెటరికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం సిఫార్సు చేసిన వరి విత్తనాలను రైతులకు అమ్మకాలు జరపాలని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పప్పవని హెచ్చరించారు. వారి వెంట సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, దుకాణాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.