నేటి సాక్షి ఆగస్టు 12
కోసిగి ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం కోసిగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వద్ద ఏఐఎస్ఎఫ్ జెండాను మాజీ జిల్లా కోశాధికారి నరసింహులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, మండల కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్యార్థి ఉద్యమాల్లో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.ఈరేష్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంతో పాటు పీజీ విద్యార్థులకు సమస్యగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి తాయన్న, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
సమరశీల ఉద్యమ చరిత్రగలది ఏఐఎస్ఎఫ్ _ కోసిగిలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Quick Summary:
_ కోసిగిలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
