నేటిసాక్షి - నవాబుపేట్, జూలై 16:
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (URS), సమగ్ర శిక్షా అభియాన్ (SSA) లో గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్. వెంకటరత్నం డిమాండ్ చేశారు. గురువారం టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నవాబుపేట మండల కేజీబీవీ బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన పోస్ట్ కార్డులను పంపే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిహెచ్. వెంకటరత్నం మాట్లాడుతూ.. కేజీబీవీ, యుఆర్ఎస్ లలో పని చేస్తున్న సిబ్బంది కష్టాలు వర్ణనాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో, సరైన రక్షణ లేని పరిస్థితుల్లో కూడా 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటున్నారని తెలిపారు. అనాథ, పాక్షిక అనాథ బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పుతూ సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఉపాధ్యాయులను, సిబ్బందిని పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఈ సిబ్బంది కూలీల కంటే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవత్వంతో ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సిబ్బంది ప్రధాన డిమాండ్లు ఇవే:
కాంట్రాక్ట్ సిబ్బంది అందరికీ మినిమం టైం స్కేలు (MTS) వర్తింపజేయాలి.
సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఉద్యోగుల సర్వీసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవు సౌకర్యాలు కల్పించాలి.
వార్షిక ఇంక్రిమెంట్లు మరియు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
రాత్రి వేళల్లో భద్రత కోసం ప్రత్యేకంగా 'కేర్ టేకర్ల'ను నియమించి, మహిళా సిబ్బందికి రాత్రి విధుల నుండి మినహాయింపు ఇవ్వాలి.
ఉద్యోగులందరికీ వారి స్థాయిని బట్టి క్యాడర్లను నిర్ధారించాలి.
తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నవాబుపేట మండల అధ్యక్షులు కే. రవీందర్, ప్రధాన కార్యదర్శి పరమేష్, కేజీబీవీ ఎస్ఓ (SO) శ్రీలతతో పాటు పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
కేజీబీవీ, యుఆర్ఎస్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి: టీఎస్ యుటిఎఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ఉద్యమం.. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం
Quick Summary:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల