నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్ 30
సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపుమాపాలని మండల తాహాశిల్దార్ పార్వతి పిలుపునిచ్చారు.పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని పరిఠిదొన ఎస్సీ కాలనీలో తహసీల్దార్ పార్వతి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిడ మాట్లాడారు.ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని, ప్రతి ఒక్కరూ చట్టం పైన అవగాహన కల్గిఉండాలని, అప్పుడే తమ హక్కులను కాపాడుకోగలరని ఆవిడ
సూచించారు.నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సూచించారు.గ్రామపంచాయతీ పరిధిలో సామిరెడ్డిపల్లి, పరికిదొన హరిజన వాడలో మంచినీటి సౌకర్యం సరిగా లేదని గ్రామస్తులు అడగ్గా డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. డ్రైనేజీ వ్యవస్థ పైన అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ప్రస్తుతానికి ఫండ్స్ లేవని, ఫడ్స్ వచ్చిన వెంటనే అధికారుల ఆమోదంతో పరిష్కారం చూపుతామన్నారు.వ్యవసాయ శాఖ అధికారులను వేరు శనెగకాయలను అడగగా స్టాకు దించుతున్నారని, అనుమతులు రాగానే పంపిణీ చేస్తామన్నారు.పశుసంవర్థక శాఖ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని, పశు వైద్యశిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ ఎస్.ఎ.గఫూర్, విద్యుత్ శాఖ ఏఈ శశిధర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సురేష్ బాబు,పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ పవన్ కుమార్ ,డిఆర్ డిఎ వెలుగు ఏపియం సుబ్రమణ్యం,రెవిన్యూ ఇన్పెక్టర్ భరత్,వ్యవసాయశాఖ అధికారి శివ,మండల వైద్యాధికారిణి డాక్టర్ మోనా, మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి,గ్రామ పంచాయతీ కార్యదర్శులు లోకేష్, శ్రీనివాసులు,గ్రామ రెవిన్యూ అధికారిణి జీవన జ్యోతి,
వెలుగు కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సుగుణమ్మ, సంఘమిత్ర రమాదేవి,నాయకులు పతి, చెగల్రాయలు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Andhra
ప్రతి పౌరుడు తమ హక్కులను తెలుసుకోవాలి - తాహాశిల్దార్ పార్వతి
Quick Summary:
ప్రతి పౌరుడు తమ హక్కులను
