నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
..............................,........
జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంబవించింది. పట్టణంలోని నడిబొడ్డున ఈ ఘటన జరిగింది.
జగిత్యాల పట్టణంలోని మార్కెట్ వెనుక మోచి బజారు ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గంగాధర్ అనే కుట్టు మిషన్‌ల వ్యాపారికి చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది.విధ్యుత్ మీటర్ నుంచి పొగలు వచ్చి ఇంట్లోకి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.సమయానికి ఫైర్ సిబ్బంది మంటలర్పకపోతే మంటలు చుట్టూ పక్కలకు వ్యాపించి భారీ నష్టం సంబవించి ఉండేదని ప్రజలు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న సుమారు 60 కొత్త కుట్టు మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఈ ప్రమాదంలో దాదాపు రూ. 8 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.కట్టెలతో నిర్మించిన పెంకుటిల్లు కావడంతో మంటల ఉధృతిలో ఇళ్లు, కుట్టు మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
*ఘటనా స్థలాన్ని సందర్శించిన ఛైర్పర్సన్ , కమిషనర్..*
జగిత్యాల మోచి బజార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో జరిగిన
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి,బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యుత్ పరికరాలు, వైరింగ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడాన్ని చైర్‌పర్సన్ వాణి అభినందించారు.
వీరి వెంట నాయకులు అడువాల జ్యోతి లక్ష్మణ్, కూతురు శేఖర్, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, ఫైర్ సిబ్బంది ఉన్నారు.
Telangana
*విధ్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం....* *అగ్నికి ఆహుతైనా ఇళ్లు, 60 కుట్టు మిషన్లు* *ఘటన స్థలాన్ని సందర్శించిన మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్* ---------------------------------------
Quick Summary:
విద్యుత్ షార్ట్ సరుక్యూలెట్ తో అగ్ని ప్రమాదం..
