నేటి సాక్షి - నవాబ్‌పేట్, జూన్ 23 :
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌ను నిరసిస్తూ నవాబ్‌పేట్ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుగారి వెంకట్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ప్రధాన చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుగారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఎలాంటి ప్రయత్నాలనైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ గీత సింగ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, సర్పంచులు కిష్టయ్య, శ్రీనివాస్, శేఖర్, జగన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాయకులు లింగం, సాయి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్, రఫీ, పరమేశ్వర్ చారి, దేవయ్య, బుచ్చయ్య, ప్రకాష్, మాణిక్యం, రవీందర్, ప్రభు, నాగరాజు, బాలరాజు, నర్సిములు, అంజయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం కాంగ్రెస్ మండల అధ్యక్షులు రావుగారి వెంకట్ రెడ్డి
Quick Summary:
కాంగ్రెస్ మండల అధ్యక్షులు రావుగారి వెంకట్ రెడ్డి