నేటి సాక్షి, ధర్మారం: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్/జూనియర్ కాలేజీ (బాలికలు) పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను అత్యుత్తమంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనే తీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు ఆహార పదార్థాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిల్వ చేయాలని సూచించారు. వంట ప్రక్రియను పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించి, విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం ధర్మారం ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ధర్మారం తహసిల్దార్ శ్రీనివాస్, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్సిపాల్ పద్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *నంది మేడారం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్* *వంటశాల పరిశుభ్రత, ఆహార నిల్వలు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని ఆదేశం* *ధర్మారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* --------------------------
Quick Summary:
*విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సమగ్ర అభివృద్ధిపై

