నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలో ఉన్న
యూరియా రేక్ పాయింట్ మరియు మార్కుఫెడ్ బఫర్ స్టాక్ గోదాం ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వల్లోజు వినోద్ కుమార్, మిర్యాలగూడ వ్యవసాయ ఉప సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి, వ్యవసాయ అధికారి రుషేంద్రమణి తో కలిసి మంగళవారం సందర్శించి, యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్కుఫెడ్ బఫర్ స్టాక్ గోదాంలో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా ఎరువు తగినంత నిల్వలో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. యూరియా యాప్ గురించి రైతులతో చర్చించారు వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
యూరియా గోదాం ను పరిశీలించిన : జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్
Quick Summary:
యూరియా గోదాం ను పరిశీలించిన
