నేటి సాక్షి ఆగస్టు 10 పాములపాడు:-
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, వివేకానంద విద్యావిహర్ హై స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్ లు పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ పాములపాడులోని, శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నుండి విద్యార్థులు ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని, దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ ఎస్ ఆర్. గోపాల్ మాట్లాడుతూ “తిరంగా మన గర్వం – దేశం మన బాధ్యత”, “జైహింద్” అంటూ జాతీయ స్ఫూర్తిని చాటారు. ర్యాలీ ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, దేశ ఐక్యత, సమగ్రత పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యతా భావాన్ని పెంపొందించాలనే సందేశాన్ని అందించారు. దేశభక్తి, జాతీయ భావాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ హెడ్మాస్టర్ రాయపాటి.శ్రీదేవి, మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Andhra
*ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి:-ఆర్.ఎస్.ఆర్. గోపాల్ (శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్)* *హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించిన శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ విద్యార్థులు*
Quick Summary:
హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించిన శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ విద్యార్థులు*
