నేటి సాక్షి మంచిర్యాల (శ్రీధర్ దమ్మ)
తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బెల్లంపల్లి ఆసుపత్రి సూపర్డెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి* మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య పరిధిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డ్స్, ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బంది యొక్క వేతనాలు పెంచాలని చాలా కాలంగా కార్మికులు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కాలపరిమితి ముగిసిన వారిని కొనసాగిస్తూ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఔట్సోర్సింగ్ విధానం రద్దుచేసి నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు కనీస వేతనం రూ.26,000/-లు ఉండాలని డిమాండ్ చేస్తున్నాము.
జీఓ నెం.60 ప్రకారం రూ. 15,600/- లు వేతనం చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేసినా కార్మికులకు చెల్లిస్తున్నది సుమారు రూ.11,000/-లు మాత్రమే. మిగిలిన డబ్బులు పిఎఫ్, ఈఎస్ఐ వాటాల పేరిట కార్మిక యజమాని వాటాలు కట్ చేస్తున్నారు. కొంత డబ్బులు కాంట్రాక్టర్లు కమిషన్ పేరిట తింటున్నారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నది. ఈ సమస్యపై ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా స్పందించడం లేదు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు కాకపోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల హైదరాబాదులో డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన సందర్భంగా జూన్ నెల నుండి వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేటికీ ఉత్తర్వులు విడుదల చేయకపోవడంతో హాస్పిటల్స్ వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈ క్రింది సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో ఆందోళనలు తీవ్రం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మౌలాలి తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి, ఆసుపత్రి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జానకి సభ్యులు శేఖర్ స్వరూప
సృజన లావణ్య దీప జానకి రాజశేఖర్ రజిత సుజాత స్వాతి మల్లేష్ భాగ్యలక్ష్మి సునీత కవిత పూజ తదితరులు పాల్గొన్నారు.
*డిమాండ్స్:*
కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలి.
పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. యజమాని వాటా ప్రభుత్వమే చెల్లించాలి. కార్మికుల జీతాల నుండి చెల్లించరాదు.
కార్మికులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ ఏజెన్సీల వేధింపులు అరికట్టాలి.
ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి మరియు గ్రాట్యుటీ అమలు చేయాలి.
కార్మిక శాఖ ఉత్తర్వుల6 ప్రకరం సెలవులు అమలు చేయాలి.
యూనిఫామ్ ఇతర రక్షణ పరికరాలు, సౌకర్యాలు కల్పించాలి. ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా భోజనాలకు మరియు రెస్ట్ రూమ్ కేటాయించాలి. క్రెచ్ సౌకర్యం ఉండాలి.
Telangana
* ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు కనీస వేతనం 26వేలు చెల్లించాలి * ఔట్సోర్సింగ్ విధానం రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. * పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి * సీఐటీయు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్డెంట్ గారికి వినతి * దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి
Quick Summary:
* ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు కనీస వేతనం 26వేలు చెల్లించాలి