మిర్యాలగూడ రైతు వేదికలో ఘనంగా "విత్తన మేళా
నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రస్తుత ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండటంతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ మిర్యాలగూడ రైతు వేదికలో సోమవారం "విత్తన మేళా ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటలైన కంది, పెసర, మినుము, ఉలవలు, అలసందతో పాటు వివిధ రకాల కూరగాయల విత్తనాలు ప్రదర్శనకు ఉంచారు. అలాగే రైతులు కోరే ఇతర పంటల విత్తనాలను కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచి విక్రయానికి సిద్ధం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ఈ విత్తన మేళాను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కొనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఎం. రుషేంద్రమణి, వ్యవసాయ విస్తరణ అధికారులు అఫ్రిన్, రమేష్, నాగయ్య, పార్వతి, డీఎం మార్క్‌ఫెడ్ సీహెచ్. కృష్ణవేణి, జానీ, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
మిర్యాలగూడ రైతు వేదికలో ఘనంగా "విత్తన మేళా
Quick Summary:
మిర్యాలగూడ రైతు వేదికలో ఘనంగా "విత్తన మేళా