నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్. 27
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాఠశాల విద్యార్థులు, వైద్యాధికారులు మరియు ప్రజా ప్రతినిధులు అవగాహన ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తారు. సమాజంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం
ఈనెల 28న నిర్వహించబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారిని మోనా పిలుపునిచ్చారు పల్స్ పోలియో విజయవంతం కోసం ఆరోగ్య సిబ్బంది ,ఆధ్వర్యంలో ర్యాలీ బస్టాండ్ లో విద్యార్థులచే మానవహారం నిర్వహించారు చౌడేపల్లి మండలంలో ఐదు మార్గాలను ఏర్పాటు చేసి 50 పోలియో చుక్కల కేంద్రాల ద్వారా చిన్నారులకు చుక్కల మందులు వేస్తున్నట్లు వివరించారు, అంతేకాకుండా జన సంచారం ఉన్న ప్రధాన ప్రాంతాలు బోయకొండ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. రేపు పల్స్ పోలియో కార్యక్రమం
Quick Summary:
ఆరోగ్యమే లక్ష్యం.. రేపు పల్స్ పోలియో
