*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి:దేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయవాదం,దేశ ప్రజల్లో ఐక్యతను నింపడమే హర్ ఘర్ తిరంగా యాత్ర లక్ష్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్ అన్నారు. బిజెపి మండల అధ్యక్షుడు చెవులమద్ది శేఖర్ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. బిజెపి నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలు చేతగాని పుర వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ గాంధీ, నెహ్రూలు ఇద్దరి వల్లనే భారత దేశానికి స్వాతంత్య్రం రాలేదని ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాస్ చంద్రబోస్ స్పూర్తిగా తీసుకొని పోరాడిన ఇరవై ఐదు లక్షల మంది భారతీయుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా దేశంలోని అన్ని గ్రామాల్లో తిరంగా యాత్ర నిర్వహించి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాలని ప్రతి ఒక్క భారతీయుడు వారి వారి ఇండ్లపై జాతీయ జెండా ఎగరేయాలని స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకుని వారి త్యాగాలను దేశ ప్రజలకు తెలియజేసేలా దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తుంది అన్నారు. స్వాతంత్ర్య అనంతరం నెహ్రూ గారి పుణ్యమా అని 370 ఆర్టికల్ తీసుకువస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2019లో 370 ఆర్టికల్ రద్దు అయ్యే వరకు భారతదేశం రావణ కాష్టంలా మారిందని అన్నారు.జాతీయ జెండా మన జాతీయ గౌరవానికి ప్రత్యేక మాత్రమే కాదని కోట్లాది భారతీయులను ఒకే తాటిపైకి తీసుకువచ్చే దేశ ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Telangana
బిజెపి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర. జాతీయ స్ఫూర్తిని కొనసాగించాలి.. బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్.
Quick Summary:
జాతీయ స్ఫూర్తిని కొనసాగించాలి..