నేటిసాక్షి, మిర్యాలగూడ : మండల పరిధిలోని అవంతిపురం గ్రామంలో
మంగళవారం ఉదయం సుమారు 5గం.ల సమయంలో గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని మిర్యాలగూడ గ్రామీణ ఎస్సై పీ.లక్ష్మయ్య తెలిపారు. వివరాల ప్రకారం...అవంతిపురంగ్రామానికి చెందిన కామ్రే రాజు తన భార్య అరుణ, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, అరుణ ఎప్పటిలాగే వంటగదిలోకి వెళ్లి విద్యుత్ స్విచ్ ఆన్ చేయగా, అప్పటికే కిచెన్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అరుణకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి.
కిచెన్ కిటికీ మూసి ఉండటంతో గ్యాస్ బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించి, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ సామగ్రి, ఇతర గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.
శబ్దం విన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై దుప్పటితో మంటలను ఆర్పి, 108 అంబులెన్స్ ద్వారా బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రి, మిర్యాలగూడకు తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్‌కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Telangana
గ్యాస్ లీకేజీ, మహిళకు తీవ్ర గాయాలు
Quick Summary:
అవంతిపురం గ్రామంలో