నేటి సాక్షి న్యూస్ జూలై 08
పెద్దకడబూరు బతుకుదెరువు కోసం స్వగ్రామాన్ని విడిచి బెంగళూరుకు వెళ్లిన పెద్దకడబూరు గ్రామానికి చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన గుమ్మల వినోద్, గుమ్మల జుబేదా మంగళవారం ఉదయం బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కుటుంబ పోషణ కోసం దంపతులు కొంతకాలంగా బెంగళూరులో సిమెంట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విధులకు వెళ్లే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినోద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన జుబేదాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆమె కూడా అనంతరం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఒకేసారి దంపతులు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృత దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
Andhra
హెడ్లైన్ : బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. పెద్దకడబూరుకు చెందిన దంపతుల దుర్మరణం
Quick Summary:
బతుకుదెరువు కోసం స్వగ్రామాన్ని విడిచి
