నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
...........................................
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని అన్నారు.ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు.అనంతరం తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూసర్వే-రీ సర్వే సందర్భంగా మల్యాల మండలంలోని సర్వా పూర్ గ్రామంలో భూముల రీ-సర్వేకు సంభందించిన అవగాహణ సదస్సు ( గ్రామ సభ) నిర్వహించారు.
భూమి రీ- సర్వే చేయుటలో చట్టం పరిదిలో వున్నా Survey and Boundary Act, 1923 గురించి మరియు సర్వే కార్యాక్రమాల గురించి, సర్వే చేయు పని విదానాల గురించి ఇట్టి గ్రామ సభలో గ్రామ రైతులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహణ కల్పించారు.ఈ కార్యక్రమంలో భూమి కొలతల ఏ. డి కిషన్ ప్రసాద్, తహసీల్దార్, సంబంధిత సిబ్బంది, బీఎల్‌వోలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*బీ.ఎల్.వో.ల ఇంటింటి ఫారాల పంపిణీని పరిశీలించిన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత* *ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి* *గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి* -------------------------------------------
Quick Summary:
గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి*