నేటి సాక్షి కూకట్‌పల్లి ఆగష్టు 15 (ప్రసాద్ ): 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ బండి రమేష్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లాపూర్, మోతీ నగర్, ప్రశాంతి నగర్, కూకట్‌పల్లి (దేశాల్ ),కూకట్‌పల్లి దయార్‌గూడ, కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1, భారత్ నగర్ మార్కెట్, కైతలాపూర్ కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, బాలానగర్, ఓల్డ్ బోయినపల్లి, హస్మత్‌పేట్, కేపీహెచ్‌బీ ఫోరం మాల్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమాలకు శ్రీ బండి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ బండి రమేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
🇮🇳 *స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా పాల్గొన్న శ్రీ బండి రమేష్ * 🇮🇳
Quick Summary:
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ