నేటి సాక్షి ఆగస్టు 04 జూపాడుబంగ్లా:-
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కై ఆగస్టు 8న విజయవాడ లో చేపట్టే మహా ధర్నా కీ సంపూర్ణ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొంటామని ఏపీ సచివాలయం సెక్రటరీ అసోసియేషన్ ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకై అనేక సంవత్సరాల నుండి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేని పరిస్థితి ఉందన్నారు. ప్రమోషన్ ఛానల్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని,నేషనల్ ఇంక్రిమెంట్స్ ప్రకటించాలని, ఎఫ్ఏసి తో కూడిన అలవెన్స్ మంజూరు చేయాలన్నారు, ఎస్ జి ఎస్ డబ్ల్యూ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఛానల్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. SGSW ఉద్యోగులను వారి మదర్ డిపార్ట్మెంట్ లకు పంపించాలని, బిఎల్ఓ విధులను సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కాకుండా సచివాలయ యోతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సమానంగా కేటాయించాలని,ప్రత్యేక క్యాంపైన్లు మరియు టార్గెట్ ఆధారిత పనుల్లో మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని అత్యవసర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి బయోమెట్రిక్ విధానంలో సడలింపు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై చేసే పోరాటంలో ఏఐటియుసి ప్రత్యక్షంగా పాల్గొంటుందని వారు తెలిపారు. ఆగస్టు 8వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి మహా ధర్నా కార్యక్రమంలో సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ మద్దతుగా ఉంటుందని వారు తెలిపారు..
Andhra
*ఆగస్టు 8న సచివాలయ ఉద్యోగుల ధర్నాకి సంపూర్ణ మద్దతు*.. *ఏపీ సచివాల హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఏఐటీయూసీ రమేష్ బాబు*
Quick Summary:
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ