*నేటిసాక్షి హైదరాబాద్*
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సేవాదళ్ ఆధ్వర్యంలో కమలా నగర్‌లోని మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320-C డిస్టిక్ గవర్నర్ కళ్ళెం కృష్ణారెడ్డి, పిడిజి ఇన్నా రెడ్డి, పిడిజి వెంకట్ నారాయణ రెడ్డి,ఫస్ట్ వాయిస్ డిస్టిక్ గవర్నర్ మండ సురేష్ కుమార్, సెకండ్ వాయిస్ డిస్టిక్ గవర్నర్ గుంటుక శేఖర్ రెడ్డి,లయన్ కళ్ళెం మోహన్ రెడ్డి,లయన్ శ్రీనివాస్ లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఎఫ్
డబ్ల్యూసి కోఆర్డినేటర్ లయన్ తుమ్మల హేమలత, లయన్ లక్ష్మీమూర్తి, లయన్ శ్రీనివాస్ రెడ్డి, లయన్ జెడ్ సి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
శిబిరంలో కంటి పరీక్షలు, దంత పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు, ఆరోగ్య సలహాలు అందించారు. కమలా నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సేవాదళ్ అధ్యక్షుడు లయన్ చింతపల్లి ఫణి భూషణ్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి లయన్ తుమ్మల నాగేంద్ర ప్రసాద్, కోశాధికారి లయన్ నమ్ముల రమేష్ యాదవ్, స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ లత,లైన్ సభ్యులు తోకల బాపురాజ్ యాదవ్, లాక ఆదిలక్ష్మి యాదవ్, కవిత తదితరులు పాల్గొని శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
Telangana
*కమలా నగర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతం*
Quick Summary:
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సేవాదళ్ ఆధ్వర్యంలో కమలా