నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంథాలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు
సత్యం, అహింసలకు ప్రతీకగా నిలిచిన మహాత్మా గాంధీ విగ్రహం నేడు నిరాదరణకు గురైంది. బాపూజీ గ్రంథాలయ ప్రాంగణంలోని విగ్రహంలో చేతికర్ర లేకపోవడం, ఒక చేయి విరిగిపోవడం . గత సంవత్సర కాలంగా అధికారులకి ఎవరికీ కనిపించడం లేదా.?
దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుని విగ్రహమే ఇలా ఉండటం విచారకరం. బాపూజీకి చేతికర్రకే దిక్కులేదా?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
గ్రంథాలయం వంటి జ్ఞానాలయంలో ఈ స్థితి బాధాకరం. ఆయన స్మారకాలను పరిరక్షించడం మన బాధ్యత.
అధికారులు వెంటనే స్పందించి విరిగిన చేయిని సరిచేసి, కర్రను అమర్చి విగ్రహానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Telangana
**బాపూజీ చేతిలో కర్ర మాయం** 👉గ్రంథాలయ ప్రాంగణంలో గాంధీ విగ్రహం దుస్థితి
Quick Summary:
గ్రంథాలయ ప్రాంగణంలో గాంధీ విగ్రహం దుస్థితి