నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూలై 16
మండలంలోని పుదిపట్ల ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం’ ని మరింత అభివృద్ధి చేసి, మండలంలోనే కాకుండా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని చౌడేపల్లి ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్.ఏ. గఫూర్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన పుదిపట్ల గ్రామంలో పర్యటించి, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఉదయం క్లాప్ మిత్రులు ఇళ్ల నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్త విధానాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం సంపద కేంద్రంలోని నాడాప్ తొట్టెలు, వర్మీ కంపోస్ట్ తొట్టెలను పరిశీలించి, ఎరువుల తయారీ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేంద్రం పరిసరాల్లో నాటిన పూల చెట్లు, పండ్ల తోటలు, తీగ మొక్కలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో మాట్లాడుతూ...
"పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. గ్రామంలోని ప్రతి ఇల్లూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ రథాలకు అందించేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. క్లాప్ మిత్రులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి."
ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి మహేశ్వర్ మరియు క్లాప్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Andhra
పుదిపట్ల చెత్త నుంచి సంపద కేంద్రాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలి: డిప్యూటీ ఎంపీడీవో ఎస్.ఏ. గఫూర్
Quick Summary:
మండలంలోని పుదిపట్ల ‘చెత్త నుంచి