నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించి మంగళవారం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ (DSB)కు చెందిన ఎస్‌ఐ బి. గైబప్ప, జిల్లా రిజర్వ్ ఆర్మ్డ్ రిజర్వ్ (DAR)కు చెందిన ఏఆర్‌ఎస్‌ఐ ఎం.ఏ. సలీం, ఏఆర్‌ఎస్‌ఐ జి. బిచ్చప్ప లు ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని అన్నారు. "ప్రభుత్వ సేవ అనేది ఉద్యోగం మాత్రమే కాదు, ప్రజల పట్ల బాధ్యతతో కూడిన పవిత్రమైన సేవ. పదవీ విరమణ పొందుతున్న అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచారు, తమ సుదీర్ఘ సేవా కాలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అందించిన సేవలు మరవలేనివి. ప్రజలకు సేవ చేయడంలో వారు చూపిన నిబద్ధత యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇట్టి అధికారులు పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.
పదవీ విరమణ పొందిన ఏఆర్‌ఎస్‌ఐ ఎం.ఏ. సలీం గారు 03.01.1989న పోలీస్ శాఖలో చేరి 37 సంవత్సరాల 6 నెలల సేవ అనంతరం పదవీ విరమణ పొందగా, ఏఆర్‌ఎస్‌ఐ జి. బిచ్చప్ప 1986లో శాఖలో చేరి 40 సంవత్సరాల 5 నెలల సేవను పూర్తి చేసి పదవీ విరమణ పొందారు. అదేవిధంగా ఎస్‌ఐ బి. గైబప్ప గారు 06.03.1985న శాఖలో చేరి 41 సంవత్సరాల 4 నెలల పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్‌పి శ్రీనివాస్, డిఎస్‌బి ఇన్‌స్పెక్టర్ నాగార్జున, ఆర్‌ఐ నాగరాజు, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ , డీపీఓ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
జిల్లా లో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,
Quick Summary:
జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా