నేటిసాక్షి, నల్లగొండ :
రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టిజిసిజిటిఏ)
కు చెందిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం జిల్లాస్థాయిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నల్గొండలో ఎన్నికల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్నికలకు ప్రధాన అధికారిగా డాక్టర్ బి.వీరన్న బాధ్యతలు నిర్వహించగా, ఎన్నికల్లో డా.కడారు సురేందర్ రెడ్డి ప్యానెల్ సభ్యులు జిల్లా బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ ఎన్నికలలో తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గా నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం సహాయ ఆచార్యులు
కే.ప్రవీణ్ రెడ్డి,
జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్జీ కళాశాల(అటానమస్) నల్లగొండ కు చెందిన నర్సింగు కోటయ్య (చరిత్ర విభాగం సహాయ ఆచార్యులు),
జిల్లా కో-శాధికారిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్) నల్గొండ కు చెందిన ఈ రాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన జిల్లా బాధ్యులను తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కె. సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోపి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెల్లి యాదయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజారామ్ అభినందించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర నిర్వాహక సెక్రటరీ డా. రాజారామ్ మాట్లాడుతూ, జిల్లాస్థాయి ఏకగ్రీవ ఎన్నిక కళాశాల ఉన్నతవిద్యా అధ్యాపకుల ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అన్ని సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కడారు సురేందర్ రెడ్డి మరియు అధ్యక్షులు గోపి కృషి ఎంతో ఉందని తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నర్సింగు కోటయ్య మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రాథమిక సభ్యుల సమస్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, వారి సమస్యలు పరిష్కరిస్తానని, ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడుతానని, ప్రాధమిక సభ్యులందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రో. అరవింద, డాక్టర్ వెంకటకృష్ణ, ఈ రాంరెడ్డి, సిహెచ్ అజయ్ కుమార్, కే ప్రవీణ్ రెడ్డి, డా.హరిత, ఎం వెంకటరెడ్డి,
కె.శివరాణి, గంజి శ్రీనివాస్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
Telangana
గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లాస్థాయి ఎన్నికలు -ఎన్నికల్లో డా.కడారు సురేందర్ రెడ్డి ప్యానెల్ సభ్యులు జిల్లా బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక -జిల్లా అధ్యక్షులు గా ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ కోటయ్య ఎన్నిక
Quick Summary:
ఎన్నికల్లో డా.కడారు సురేందర్ రెడ్డి ప్యానెల్ సభ్యులు జిల్లా బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక
