*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
జీడిమెట్ల 132వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర ఎన్‌క్లేవ్ కాలనీ ప్రజలు నింపిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) దరఖాస్తు ఫారాలను నేడు 571, 572 పోలింగ్ బూత్‌ల బూత్ లెవల్ ఆఫీసర్లకు ( బిఎల్ఓ లు) బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి అందజేశారు. ఓటర్లందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా ప్రతి ఇంటికి చేరుకుని అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరగాలి. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలం. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత" అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించడం, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడడం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
Telangana
*వెంకటేశ్వర ఎన్‌క్లేవ్ ప్రజలకు సేవలో మరో ముందడుగు*
Quick Summary:
జీడిమెట్ల 132వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర