నేటి సాక్షి..గండిపేట్, జూన్ 29 ( సుధాకర్ గౌడ్)
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిస్మత్పూర్ విలేజ్ నుంచి బండ్లగూడ వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ కీలక రహదారిపై భారీ గుంతలు ఏర్పడి, దెబ్బతిన్న మ్యాన్‌హోల్ కవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆయన తెలిపారు.ప్రజల భద్రతను పూర్తిగా విస్మరించిన GHMC అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.కిస్మత్పూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ వేలాది మంది ఈ రహదారిపైనే ప్రయాణిస్తున్నారని తెలిపారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలవడంతో వాటి లోతు కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, పలువురు గాయపడుతున్నా అధికారులు స్పందించడం లేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దురదృష్టకరమని, ప్రజల పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటున్న అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.అధికారులు స్పందించకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు.తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున కిస్మత్పూర్–బండ్లగూడ ప్రధాన రహదారిని అత్యవసరంగా పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, రోడ్డు మధ్యలో ఉన్న అన్ని గుంతలను వెంటనే పూడ్చాలని, దెబ్బతిన్న మ్యాన్‌హోల్ కవర్లను కొత్తవాటితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.తాత్కాలిక మరమ్మతులతో కాకుండా శాశ్వత పరిష్కారం కోసం నాణ్యమైన రహదారి నిర్మాణం చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్, అధికారులు తక్షణమే స్పందించి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.ఒకవేళ నిర్లక్ష్య ధోరణి కొనసాగి రహదారి మరమ్మతులు చేపట్టకపోతే తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి భారీ స్థాయిలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Telangana
...ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న GHMC – కిస్మత్పూర్–బండ్లగూడ రహదారి దుస్థితిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ మండిపాటు* *. రహదారిపై నిత్యం ప్రమాదాలు – వెంటనే మరమ్మతులు చేపట్టాలని నీరుడు సర్వేష్ ముదిరాజ్ డిమాండ్* *.ప్రజల ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు – నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ తీవ్ర ఆగ్రహం* *.రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే ప్రజలతో కలిసి భారీ ఆందోళనకు సిద్ధం – తెలంగాణ రక్షణ సేన పార్టీ హెచ్చరిక*
Quick Summary:
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న