నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో భూముల రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా పట్టా భూముల డీమార్కేషన్ ప్రక్రియను మంగళవారం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి రమణారెడ్డి
పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల హద్దుల నిర్ధారణ పనులు నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో తహశీల్దార్ సర్వేయర్, జీపీఓ, తదితరులు పాల్గొన్నారు.
Telangana
తిమ్మారెడ్డిగూడెంలో భూముల రీ-సర్వే -పనులను పరిశీలన చేసిన ఆర్డీఓ రమణారెడ్డి
Quick Summary:
పనులను పరిశీలన చేసిన ఆర్డీఓ రమణారెడ్డి