Telangana
"సర్" ఓటర్ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలి -గ్రామాలు, పలు వార్డుల్లో ఆర్డీఓ పరిశీలన
Quick Summary:
గ్రామాలు, పలు వార్డుల్లో ఆర్డీఓ పరిశీలన
నేటిసాక్షి, మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ ఓటరు ప్రత్యేక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేలా సంబంధిత అధికారులు బిఎల్ఓ లుఆ చొరవ చూపాలని మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 153 జప్తి వీరప్పగూడెం, అన్నారం పీఎస్ నెం 156, 157, జటావత్ తండా పీఎస్ నెంబర్ 154, మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు 82 పోలింగ్ స్టేషన్ నెంబర్, సీతారాంపురం పీఎస్ నెం 80, లను మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సర్ దరఖాస్తులను నింపి సంబంధిత బిఎల్ఓ లకు అందజేయాలని, నిర్ణీత గడువులోపు అధికారులు సర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బిఎల్ఓ లు, తదితరులు పాల్గొన్నారు.
