నేటి సాక్షి జూన్ 30పాములపాడు :-
పాములపాడు మండలంలోని జూటూరు గ్రామంలో వెలసిన మౌలాలిస్వామి సరిగెత్తు వేడుకలో నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మంగళవారం పాల్గొన్నారు.ముందుగా మాజీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మౌలాలిస్వామికి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు.అనంతరం గ్రామ నాయకులు బోయ తిరుపతయ్య ఇంటికి చేరుకున్నారు.అనుచరవర్గంతో ఆత్మీయంగా కొద్దిసేపు మాట్లాడారు.మాజీ ఎమ్మెల్యే ఆర్థర్ వెంట నాయకులు ముడియాల రమణారెడ్డి, ఏపీ వడ్డెర కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ ఓర్సు రామసుబ్బయ్య, వైస్ ఎంపీపీ బండ్లమూరి వెంకటేశ్వర్లు, కో ఆప్టెడ్ మెంబరు ముర్తుజాఅలీ,ముడియాల సుబ్బారెడ్డి,గ్రంథి పీరయ్య,షేక్షాఅలీ,తాటిపాడు ఉస్మాన్, భూమా రాములమ్మ, గంటా రమేష్, స్వామినాయుడు, వెంకటేశ్వరరెడ్డి,రామలింగారెడ్డి, వర్రా రమణ,రాజన్న,మల్లయ్య,జూటూరు ఆచారి,కడతల స్వామన్న,తదితరులు పాల్గొన్నారు.
Andhra
జూటూరు మౌలాలిస్వామి సరిగెత్తు వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
Quick Summary:
జూటూరు మౌలాలిస్వామి సరిగెత్తు
