నేటి సాక్షి ఆగస్టు 11పాములపాడు:-
పాములపాడు లోని, ప్రెస్ క్లబ్ లో సెప్టెంబర్-6వ తేదీన అనంతపురంలో జరిగే బామ్ సేఫ్ సంస్థ & రాష్ట్రీయ మూల నివాసి సంఘ్ ఆధ్వర్యంలో జరిగే ఏపీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఓబిసి మోర్చా జిల్లా కన్వీనర్ డాక్టర్ డి.నాగన్న ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు మండల కన్వీనర్ బి.నరసింహులు, డాక్టర్ బత్తుల సంజీవరాయుడు, సయ్యద్.ముర్తుజాఅలీ, ఎస్.షేక్షాఅలీ, సయ్యద్ భాష, షేక్.గౌస్ బాష, నరసింహ గౌడ్, షేక్.కలిముల్లా, కలబండి.అంకన్న, తదితర నాయకులతో కలిసి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన ముక్తి పార్టీ (బి.ఎం.పి) జిల్లా కన్వీనర్ డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ మనదేశంలో ఓబిసి కులగణన జరగాలని, సిపిఎస్, ఎన్ పీఎస్ ఉద్యోగులకు, విద్య- వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేయకూడదని, దేశంలో జరిగే అన్ని ప్రవేశ పరీక్షలను అవకతకలు జరగకుండా నిరోధించాలని, నీట్ పరీక్షలను రద్దుచేసి రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్ష నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, తదితర అంశాలపై ఈ అనంతపురం మహాసభలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కాబట్టి రాష్ట్రంలోని, బహుజనులందరూ ఈ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Andhra
*సెప్టెంబర్-6 వ తేదీన అనంతపురంలో జరిగే బామ్ సేఫ్ ఏపీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి:-డి.నాగన్న(ఓబిసి మోర్చా జిల్లా కన్వీనర్)*.
Quick Summary:
డి.నాగన్న(ఓబిసి మోర్చా జిల్లా కన్వీనర్)*.
