నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
..........................................
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా విద్యాధికారి రాము అన్నారు.ఈరోజు స్థానిక ఓల్డ్ హై స్కూల్ జగిత్యాల లో
తెలంగాణ ప్రభుత్వ మరియు కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి *అక్క–అన్న ఏఐ మెంటర్స్* కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ – ఏఐ) ఆధారంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఏఐ, కోడింగ్, కంప్యూటర్ నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని, ఇవి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి వినూత్న కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
*ఈ సందర్భంగా ఎస్ కేఎన్అర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. శ్రీనివాస్ మాట్లాడుతూ*
పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ చేపట్టిన అక్క–అన్న ఏఐ మెంటర్స్ కార్యక్రమం ఎంతో దూరదృష్టితో కూడుకున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 70 ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశపెడుతున్నామని వారన్నారు.
*నోడల్ అధికారి డా.సాయి మధుకర్ మాట్లాడుతూ*
విద్యార్థులు భవిష్యత్తులో ఏఐ కోడింగ్ డిజిటల్ టెక్నాలజీలో నైపుణ్యాలను పెంపొందించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు
ఈ సందర్భంగా ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అక్క–అన్న ఏఐ మెంటర్లుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కోడింగ్ ప్రాథమిక అంశాలు, ఏఐ వినియోగం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించారు. కంప్యూటర్ ద్వారా కోడింగ్ డెమోలను ప్రదర్శించి, ఏఐ ఆధారిత అనువర్తనాలను సరళంగా వివరించారు. పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ, జిల్లా అకాడమిక్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, , ఎన్‌సీసీ అధికారి డా పి. రాజు, అక్క–అన్న ఏఐ మెంటర్స్ జిల్లా నోడల్ అధికారి , శ్రీ కె. శ్రీనివాస్, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినిపెల్లి ఆనందరావు, సూర్యప్రకాశ్, శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు, అక్క–అన్న ఏఐ మెంటర్స్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Telangana
*ఏఐ టెక్నాలజీతో ఉజ్వల భవిష్యత్తు జిల్లా విద్యాధికారి రాము* -------------------------------------------
Quick Summary:
ఉజ్వల భవిష్యత్తు జిల్లా విద్యాధికారి రాము*