నేటి సాక్షి,నారాయణపేట జూన్ 2, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో రాఘవేంద్ర కాలింగ్ లో ఉన్న ప్రభుత్వ స్థలమైన సర్వేనెంబర్ 41లో 29 గుంటలపై సంబంధి శాఖ రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నారాయణపేట జిల్లా సిపిఐ కార్యదర్శి పి. వెంకటేష్ అధికారులను కోరారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధన్వాడ ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు 11,203, 204,208,163, 26, ఇట్ ఇస్ సర్వే నెంబర్లలో ప్రకారం 2024 సంవత్సరంలో ఏడు ప్లాట్లకు గాను 14 మంది కబ్జాదారులు గురి చేశారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఇట్టి సర్వే నెంబర్లలో ప్రభుత్వ గ్రంథాలయము కూడా ఉందన్నారు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ కూడా తీర్మానం లేకుండా నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇట్టి ప్రభుత్వ సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టాలన్నారు లేనియెడల ఎర్రజెండాలు పాతడం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో కంచెను ఏర్పాటు ప్రభుత్వం బోర్డును చేయాలని మండల రెవెన్యూ అధికారులను ఆయన డిమాండ్ చేశారు.
Telangana
ధన్వాడలో గ్రామకంఠం లో ని రాఘవేంద్ర కాలనీలో ప్రభుత్వ స్థలం 29 గుంటల భూమిపై పూర్తి స్థాయి లో విచారణ చేపట్టాలి. సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి పి వెంకటేష్.....
Quick Summary:
సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి పి వెంకటేష్.....
