నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
...........................................
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) -2026 కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్యూమరేషన్ ఫారం నింపడంపై సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని ఓటర్లు తమ ఓటరు జాబితాలో నమోదైన వ్యక్తిగత వివరాలు, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో), బీఎల్‌వో సూపర్‌వైజర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌వో), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) వివరాలతో పాటు ఎన్యూమరేషన్ ఫారం నింపే విధానంపై ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను లేదా హెల్ప్‌లైన్ నంబర్ 7989193131ను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఎస్.ఐ.ఆర్.-2026 ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు చురుకుగా పాల్గొని, తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైతే ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపి సమర్పించాలని కలెక్టర్ కోరారు. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్ డెస్క్ ద్వారా అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Telangana
*స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్* ---------------------------------------------
Quick Summary:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్