నేటి సాక్షి జూలై 14
పెద్దకడబూరు గ్రామ సచివాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఓటరి వివరాలు నమోదు అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) బూత్‌ల వారీగా నమోదైన పురోగతి వివరాలను వెల్లడించారు. బూత్ నంబర్ 204లో 98 శాతం, 206లో 85 శాతం, 207లో 81 శాతం, 208లో 98 శాతం, 209లో 98 శాతం వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు.
గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, ప్రతి అర్హుడి పేరు నమోదు అయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Andhra
పెద్దకడబూరులో ఎస్‌ఐఆర్ ప్రత్యేక కార్యక్రమం
Quick Summary:
పెద్దకడబూరు గ్రామ సచివాలయంలో