నేటి సాక్షి.శంకర్‌పల్లి, జులై 02 ( సుధాకర్ గౌడ్):
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, ప్రతి అర్హ ఉద్యమకారునికి 250 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.ఉప్పల్ బాగాయత్ భూ పోరాటంలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత అక్కను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉద్యమకారులకు పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరచిపోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.ఉద్యమకారులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ హక్కులను ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కును కాలరాసే విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. “ఆ రోజు ఉద్యమకారులు రోడ్లపైకి రాకపోతే, లాఠీ దెబ్బలు తినకపోతే, జైలు శిక్షలు అనుభవించకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?” అని ప్రశ్నించారు.అలాంటి ఉద్యమకారులే నేడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడిగితే వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.కవిత అక్కను కేవలం ఉద్యమకారుల హక్కుల కోసం ప్రశ్నించినందుకే అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొంటూ, వెంటనే ఆమెను బేషరతుగా విడుదల చేయాలని, ఉద్యమకారులపై నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యమకారులను భయపెట్టేందుకు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా తెలంగాణ రక్షణ సేన వెనక్కి తగ్గదని, హక్కుల సాధన కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, ముఖ్యంగా 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపుపై వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలే వారికి నిజమైన నివాళి అవుతుందని అన్నారు.ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Telangana
*నీరుడు సర్వేష్ ముదిరాజ్: కవిత అక్క అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.. బేషరతుగా విడుదల చేయాలి* *.నీరుడు సర్వేష్ ముదిరాజ్: తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం ఉప్పల్ బాగయత్ భాగంగా 250 గజాలు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని తక్షణమే నెరవేర్చాలి* *.నీరుడు సర్వేష్ ముదిరాజ్: తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే* *.నీరుడు సర్వేష్ ముదిరాజ్: ఉద్యమకారులను భయపెట్టే అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు* *.నీరుడు సర్వేష్ ముదిరాజ్: ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగుతుంది*
Quick Summary:
బేషరతుగా విడుదల చేయాలి*