*గంజాయి, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు*
👉 ఎస్సై బండి మోహన్ బాబు
నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహం ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్, నార్కోటెక్ వంటి మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై బండి మోహన్ బాబు తెలిపారు. మండల కేంద్రంలోని మంగళవారం పలు కిరాణా షాపులు, టీ స్టాల్ లో పోలీస్ డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, నార్కోటిక్ వంటి మత్తు పదార్థాలు అమ్మకాలు జరిపినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని యువకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వరావు డాగ్ స్క్వాడ్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
*గంజాయి, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు* 👉 ఎస్సై బండి మోహన్ బాబు
Quick Summary:
గంజాయి, డ్రగ్స్, నార్కోటెక్ వంటి