.
వికారాబాద్ జిల్లా కలెక్టర్దీపక్ తివారి .
వికారాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, ఉద్యానవన శాఖ, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు లభించే ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాగు విధానాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, కొనుగోలు విధానం వంటి అంశాలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి, వారికి సాంకేతిక సలహాలు, అవసరమైన మార్గదర్శకాలు అందించాలని చెప్పారు.
రైతు ఆయిల్ ఫార్మ్ క్షేత్ర సందర్శన ఆయిల్ ఫార్మ్ కంపెని సందర్శన చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని, సాగు విస్తీర్ణం పెంచేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ, ఆయిల్ పామ్ సాగులో విజయవంతమైన రైతుల అనుభవాలను ఇతర రైతులకు పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ట్రిని కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్ ,ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్, సంబంధిత శాఖల అధికారులు, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Telangana
ఆయిల్ పామ్ పంటలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి
Quick Summary:
వికారాబాద్ జిల్లా కలెక్టర్దీపక్ తివారి .