నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 10 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
నారాయణపేట జిల్లా కేంద్రంలో
కార్మిక, రైతు, కూలీల సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం రోజు మునిసిపల్ పార్క్ నుంచి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, మీడుగ ర్యాలి వచ్చి అంబేద్కర్ చౌరస్థలో రాస్తారోకో నిర్వహించారు .
అనంతరం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు .
అంతకుముందు సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం,ఎఐయూకేఎస్ జిల్లా కార్యదర్శి యాదగిరి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు కాశీనాథ్,టియుసిఐ జిల్లా కార్యదర్శి రాము , ఎఐయుకెఎంఎస్ ప్రశాంత్ ప్రసంగించారు.
కార్మికులను కట్టు బానిసత్వానికి నెట్టే నాలుగు కార్మిక కోడ్ లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ విధానాలతో సంపన్నుల ఆదాయాలు పెరుగుతున్నాయని శ్రమజీవుల వేతనాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిత్యవసర ధరల పెరుగుదలతో కార్మిక వర్గం అతలాకుతలమవుతుందని అన్నారు.
ఉపాధి కూలీల పొట్ట గొట్టే వి బిజి రాంజీ బిల్లును వెంటనే రద్దు చేయాలని, మాహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు .
ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయల అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కల్పించాలన్నారు
అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా దేశాలతో స్వేచ్ఛ వాణిజ ఒప్పందాలను చేసుకొని 32 రకాల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారని దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం ఆత్మహత్యలకు లోనవుతున్నారన్నారు దేశానికి అన్నం పెట్టా రైతన్న కుదేలు అవుతున్నారని అన్నారు. కార్పొరేట్ అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని ఈ దేశంలో అత్యధికంగా ఉన్న పేద మధ్యతరగతి కార్మిక వర్గపు అనుకూలమైన విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాలమణి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్, టియుసి జిల్లా నాయకులు నర్సింహ ప్రసాద్ తెలిసే జిల్లా కోశాధికారి నరసింహ సిఐటియు జిల్లా నాయకులు నరహరి సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ నారాయణపేట పట్టణ నాయకులు కెంచి నారాయణ ,చన్నా రెడ్డి ఉపాధి క్షేత్ర సహాయకుల యూనియన్ ,డి కృష్ణయ్య హమాలి పట్టణ అధ్యక్షులు ఏసు రత్నం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దస్తప్ప బొమ్మన్‌పాడ్ బలరాం అంగన్వాడి నాయకులు, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి అనురాధ, మున్సిపల్ యూనియన్ సాయిలు సీపీఎం సోషల్ మీడియా కన్వీనర్ సోఫీ మజర్ ఉసేన్ గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Andhra
సంపన్నుల ఆస్తులు పెరుగుతున్నాయి..... శ్రామికుల వేతనాలు తరుగుతున్నాయి.... దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాలతో వల్ల బయట జీవించే అవకాశం లేదు..... అందుకే జైల్ భరో సిద్ధమయ్యాం...... సీపీఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి జి వెంకటరామరెడ్డి....
Quick Summary:
అందుకే జైల్ భరో సిద్ధమయ్యాం......

