*నేటిసాక్షి* జూలై 27
తిరుమలాయపాలెం (రిపోర్టర్ రుద్రరాజు )
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏసీఎల్బీ ఆఫీసర్ శ్రీజ సూచనలతో మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఏఈఓలు, టీఏలు, ఎఫ్‌ఏలతో మండల అభివృద్ధి అధికారి షేక్ సిలార్ సాహెబ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి ప్రతి రైతుకు నీటి గుంట, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత" కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులను గుర్తించి వారికి 100 శాతం సబ్సిడీతో ఫామ్ పాండ్ (నీటి గుంట) నిర్మించి అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.మండలంలోని 40 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 20 వేల మంది రైతుల జాబ్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి రైతుకు వికసిత్ భారత్ పథకం కింద ఫామ్ పాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.గ్రామాల పాలక మండళ్లు, గౌరవ సర్పంచులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తమ గ్రామాలకు మంజూరైన అన్ని యూనిట్ల నిర్మాణాన్ని ఆగస్టు 15లోపు పూర్తి చేయడానికి సహకరించాలని అధికారులు కోరారు. అర్హులైన రైతులు మరిన్ని వివరాల కోసం తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిలార్ సాహెబ్, వ్యవసాయ అధికారి సీతారామరెడ్డి, ఎంపీవో షైక్ మీరా, ఏపీవో నర్సిహారావ్, అగ్రికల్చర్ ఏఈఓలు, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు..
Telangana
*ఐదు ఎకరాల లోపు రైతులకు 100% సబ్సిడీతో ఫామ్ పాండ్లు..* *జలసిరి పథకంపై మండల స్థాయి సమీక్ష సమావేశం.* *ప్రతి రైతుకు నీటి గుంట - ప్రతి ఇంటికి ఇంకుడు గుంత లక్ష్యంగా ప్రభుత్వం.* *40 గ్రామపంచాయతీల్లో 20 వేల మంది రైతుల జాబ్ కార్డుల పరిశీలన.* *అర్హులైన రైతులకు వికసిత్ భారత్ పథకం కింద ఫామ్ పాండ్ నిర్మాణం.* *ఆగస్టు 15లోపు మంజూరైన అన్ని యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచన.*
Quick Summary:
జలసిరి పథకంపై మండల స్థాయి సమీక్ష సమావేశం.*
