నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం : చిలుకూరు మండల కేంద్రంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారికి చెరువులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ మరియు గదుల గోడలనే ఆధారంగా చేసుకొని అటు పాఠశాల ఉపాధ్యాయ సహకారం, జాతీయ రహదారి అధికారులు మరియు సహా సహకారాలతో దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి కాలంలో దుకాణాలు తీయాలని పలుమార్లు జాతీయ రహదారి అధికారి రావటం జరిగింది. కానీ ఏమి జరిగిందో ఏమో జాతీయ రహదారి అధికారులే మేము తొలగించేందుకు రాగానే మీరు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయమంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని కొంతమంది బాహాటంగానే చెబుతున్నారు. ఇదిలా ఉంటే దుకాణాల వెనకాల పిల్లలకు సంబంధించిన మరుగుదొడ్లు ఉండటం గదులపై ఎలాంటి పై కప్పు లేకపోవడంతో మూత్రవిసర్జనకు కూడా వారు భయపడి వెళ్లలేని దినస్థితిలో ఉన్నామంటూ పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా పాలనాధికారి, జిల్లా స్థాయి అధికారులు, జాతీయ రహదారి ఉన్నత స్థాయి అధికారులు మండల కేంద్రంలోని జడ్పి పాఠశాల భవనం పై ఉన్న దుకాణ సముదాయాలను, పరిసరాలను పరిశీలించి.ఆక్రమించిన అక్రమనలను తొలగించి విముక్తి కల్పించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
Telangana
*అధికారులే అండగా.... ప్రభుత్వ పాఠశాల భవనాలే ఆధారంగా...*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం :

