నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా లో
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా జర్నలిస్టులు జిల్లా విద్యాశాఖ అధికారిని (డీఈవో) మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. సమాజం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం ఎక్కువగా ఉండటంతో చదివించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు పూర్తి ఫీజు రాయితీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రాన్ని డీఈవో సానుకూలంగా స్పందించి మీరు చెప్పినట్లు రాయితీ కల్పించే విదంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో రాంచేందర్, టి ఆనంద్, సంతోష్, అమర్, జావీద్, రాజు, శ్రీకాంత్, వెంకట్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
జర్నలిస్టులకు 100% ఫీజు రాయితీ కల్పించాలి. డీఈవోకు వినతిపత్రం అందజేసిన వికారాబాద్ జర్నలిస్టులు.
Quick Summary:
డీఈవోకు వినతిపత్రం అందజేసిన వికారాబాద్ జర్నలిస్టులు.