*నేటిసాక్షి హైదరాబాద్*
తెలంగాణ
రాష్ట్ర భట్రాజ సంఘం (2026–2029) నూతన రాష్ట్ర మహిళా, యువజన కమిటీల ఎన్నికలు జూలై 19 (ఆదివారం) న ఇంజాపూర్‌లోని రాష్ట్ర సంఘ భవనంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సంఘం అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు, ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్ణచందర్ రాజు గురువారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ కమిటీతో కలిసి అన్ని జిల్లాల సభ్యుల సమ్మతితో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా, యువజన కమిటీలకు సంబంధించిన వివిధ పదవులకు ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘంలో చెల్లుబాటు అయ్యే సభ్యత్వం కలిగిన సభ్యులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేందుకు అర్హులని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల ఓటరు జాబితాలోని తమ క్రమ సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అలాగే, అన్ని జిల్లాల మహిళా, యువజన కమిటీల కార్యవర్గ సభ్యులు ఎన్నికల అధికారి విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం ఆధార్ కార్డుతో హాజరై తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర మహిళా, యువజన కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకొని రాష్ట్ర సంఘ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Telangana
*జులై 19న రాష్ట్ర భట్రాజ్ సంఘం మహిళా, యువజన కమిటీల ఎన్నికలు*
Quick Summary:
రాష్ట్ర భట్రాజ సంఘం (2026–2029) నూతన