ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో ఘనంగా అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి మాధవ రెడ్డి, అడిషనల్ డిఆర్డిఏ సత్తయ్య, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, వ్యవసాయ అధికారి కవిత, డి.ఎస్. ఓ సుదర్శన్ వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
Telangana
ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం.
Quick Summary:
ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి