నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా కొత్త గడి TSWRS బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
గురువారం
జిల్లా కలెక్టర్ TSWRS బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లాలోని TWRS గురుకుల పాఠశాల, కళాశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, పలువురు విద్యార్థులు టీసీలు (TCలు) ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడం లేదా ఇతర విద్యాసంస్థలకు వెళ్లే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో సమగ్రంగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల ప్రవేశాలు, హాజరు, డ్రాపౌట్‌లు, టీసీల జారీకి సంబంధించిన రిజిస్టర్ లను పరిశీలించారు.
విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, వసతి, భోజనం తదితర అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
ఫిర్యాదులకు కారణమైన అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, హాస్టల్, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో మమేకమై వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి, మెనూ ప్రకారం భోజనం ఉండాలని,భోజన నాణ్యతపై ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, పరిశీలించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ప్రతి విద్యార్థినికి అందేలా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఇంటర్ రెండవ సంవత్సరo చదువుతున్న విద్యార్థులకు లెక్చరర్ గా మారి లెక్కలు బోధించి వారితో సమాధానాలు చెప్పించారు.
పాఠశాలలో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే పరిష్కరించి, విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో ట్రైని కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, కళాశాల ప్రిన్సిపాల్ సాయి లత, ఎస్సి వెల్ఫేర్ అధికారి జయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
Quick Summary:
ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

