నేటి సాక్షి : జులై 21:-పోతారం గ్రామంలో అధ్వాన్నంగా రహదారులు.. ప్రజలకు నిత్య నరకయాతన
బెజ్జంకి మండలం, పోతారం గ్రామం:
వర్షాలు కురవడంతో పోతారం గ్రామంలోని ప్రధాన రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారాయి. రోడ్డంతా బురద, నీటి గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
స్థానికుల పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రహదారిపై నీరు నిలిచి ప్రయాణం దుర్భరంగా మారుతోందని చెబుతున్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Telangana
గుంతలమయమైన రోడ్లు.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న పోతారం
Quick Summary:
బెజ్జంకి మండలం, పోతారం గ్రామం
