*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలో మల్లంపేటలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ట్రాఫిక్ నియంత్రణ కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 700 ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన మల్లంపేట్ గ్రామమంలో నిరుపేదల ఇళ్ళు కూల్చివేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టవద్దని , ఓల్డ్ హైదరాబాద్ రోడ్డును ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మల్లంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక బీజేపీ నాయకులు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ధర్నాకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం వందల ఎకరాల భూములను కోల్పోయిన మల్లంపేట్ ప్రజలు ప్రస్తుతం కొత్త రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ పేరుతో మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా పేద ప్రజల ఇళ్లు, నిర్మాణాలను తొలగించడం వల్ల నిరుపేద కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.మరోవైపు ఆంటీలియా, జేఎన్‌ఎం, మోడీ బిల్డర్స్‌కు చెందిన విల్లా ప్రాజెక్టులు, వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీల కారణంగా మల్లంపేట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సంప్రదాయ రహదారులు మూసివేయబడ్డాయని ఆరోపించారు.
దీంతో మల్లంపేట్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
*మల్లంపేటను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు....: బీజేపీ నాయకులు ఎంబరి ఆంజనేయులు*
ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ప్రజాప్రతినిదులు నేడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు విస్తరణ కోసం నిరుపేదలు ఇల్లు కూల్చేందుకు సిద్ధమవుతున్నా కనీసం ఆ నిరుపేదల వైపు కన్నెత్తి చూడడం లేదని బిజెపి నాయకులు ఆంజనేయులు ఆరోపించారు. ప్రజా ప్రతినిధులందరిని కడుపులో పెట్టుకుని చూసుకునే మల్లంపేట గ్రామస్తులు బాధలు ఆ ప్రజా ప్రతినిధులకు కనబడటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసి రోడ్ల విస్తరణ చేపట్టడం నిరుపేదలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్ రోడ్డును వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, మూసివేసిన రహదారులను తెరిచి ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖల అధికారులను స్థానికులు కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో నిరుపేద ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Telangana
*రోడ్డు కోసం రోడ్డెక్కిన మల్లంపేట గ్రామస్థులు*
Quick Summary:
రోడ్డెక్కిన మల్లంపేట గ్రామస్థులు
