నేటి సాక్షి, కులకచర్ల
(సురేష్ మోత్కూర్ )
కులక్చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బోలుసుని భీమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. బొలుసని భీమ్ రెడ్డి మాట్లాడుతూ... 25 ఏళ్లుగా నేను రాజకీయంలో ఉంటూ ఒకే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను. పిఎసిఎస్ పదవి రావడం నాకు చాలా సంతోషం. గతంలో కూడా చాలాసార్లు రైతుల కోసం పనిచేశాను రైతుల కోసం పనిచేసే పదవులను చేయడం జరిగింది. మరియు ఈ సమయంలో కూడా నాకు మళ్ళీ రైతులకు సేవ చేసే అదృష్టం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రైతుల కోసం నిరంతరం పనిచేస్తూ వారికి కావలసిన రుణాల విషయంలో వ్యవసాయ పరికరాల విషయంలో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. నాకు అవకాశం కల్పించిన పరిగిని నిరంతరం అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. చాలామంది నాయకులు ఎన్నోసార్లు నన్ను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉంటావని అడగడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళకు అర్థమవుతుంది నేను నమ్ముకున్న పార్టీ నేను నమ్ముకున్న కార్యకర్తలే నన్ను బలంగా నిలబెట్టారని ఈరోజు నిరూపించడం జరిగింది . ఎప్పుడైనా ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తులు చెడిపోరని రామ్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కష్టపడ్డ వ్యక్తులను గుర్తించి వారికి తగ్గట్టుగా గౌరవం లభిస్తుందని తెలిపారు. రామ్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన వెంటనే అసెంబ్లీలో అన్నమాట "జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు- నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు" అనే మాటను మరొకసారి గుర్తు చేశారు. రామ్మోహన్ రెడ్డి గారు పరిగి అభివృద్ధి కోసం విద్యా,వైద్యం, రవాణా కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి నిధులు తేవడం చాలా సంతోషమని తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి తను దగ్గరుండి జరిపించడం నాకెంతో సంతోషమని, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనకు అండగా ఉన్నందుకు నాకు నమ్మకంగా ఉంటున్నందుకు వారికి జీవితాంతం తనకు రుణపడి ఉంటానని తెలిపారు. నా ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని కచ్చితంగా తెలిపారు. నా జీవితానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుందని సభాముఖంగా తెలిపారు. పరిగి ఎమ్మెల్యే,టిపిసిసి ఎస్ఐఆర్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... పార్టీ కోసం పని చేసే వ్యక్తులను గుర్తించి వాళ్లకు తగిన గౌరవం తప్పకుండా ఇస్తాను అని తెలిపారు ప్రస్తుతం ప్రత్యేకంగా కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రత్యేక దృష్టితో బిఎల్ఎలు ఉండాలని మన ఓట్లను మనం కాపాడుకోవాలని అనవసరమైన ఓట్లను తొలగించాలని ప్రత్యేకంగా తెలపడం జరిగింది కులక్చర్ల పిఎసిఎస్ చైర్మన్ భీమిరెడ్డి గారికి వారి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Telangana
*కులక్చర్ల పిఏ సి ఎస్ చైర్మన్ బొలుసుని భీమ్ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం.* • పరిగి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. • పరిగి నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు హాజరు. • బొలుసని భీమ్ రెడ్డికి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు అభినందనలు. • కాంగ్రెస్ కార్యకర్తలే నా బలం బలగం అంటున్న భీమ్ రెడ్డి.
Quick Summary:
• పరిగి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో