నేటి సాక్షి న్యూస్ జూన్ 12
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కోసిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు వై. ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాడిగేని ప్రాంతం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తిరిగి వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వైఎస్సార్‌సీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Andhra
హెడ్లైన్ : కోసిగిలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ _ 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధీమా
Quick Summary:
కోసిగిలో వైఎస్సాఆర్ భారీ ర్యాలీ....